Welcome to SRI GURAPPA SWAMY DEVASTHANAM

The shrine of Lord Sri Gurappa Swamy in India is located in the village of Sodanapalli in Anantapur District of Andhra Pradesh.


శ్రీ గురప్ప స్వామి ప్రసన్న

శ్రీ గురప్ప స్వామి విగ్రహప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక



స్వస్తిశ్రీ దుర్ముఖినామ సం|| కార్తీక మాసం కృ|| షష్టి 19-11-2016వ తేదీ శనివారం ఉదయం 8-30 నిల||కు ధనుర్ లగ్న శుభపుష్కరాంశమందు. స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మరియు పూజ అభిషేకములు జరుగును. కావున గ్రామ ప్రజలు యావన్మంది భక్తాదు లెల్లరు పాల్గొని తీర్థ ప్రసాదములు తీసుకొని ఈ కార్యక్రమము జయప్రదం చేయుదురని కోరుచున్నాము.

కార్యక్రమము వివరములు

17-11-2016 వ తేదీ గురువారం :
ఉదయం: గణపత్ పూజ, గో పూజ, స్వస్తి వాచనము, నాంది, గంగ పూజ, పంచ గవ్యమేళనము, కంకణధారణ, రుత్వీకరణము, కలశస్థాపన, ఆకాండ దీపారాధన, జపాలు, వేద పారాయణము, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాదములు జరుగును.
సాయంత్రం: ప్రదోష షోడశోపచార పూజలు, క్షీరాదివాసము, జలాధివాసము, జపాలు, గణపతి హామము, రుద్ర హామము, దుర్గ హామము, సుబ్రహ్మణ్యేశ్వర, సుదర్శన హామములు, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాదములు జరుగును.

18 -11-2016 వ తేదీ శుక్రవారం :
ఉదయం: కలశారాధన, షోడాశ ఉపచారా పూజలు, మహాన్యాస సహిత మహాస్నావనము, పంచ సూక్తులతో అభిషేకాలు, ధాన్యాదివాసము, లక్ష్మి నారాయణ హామము, నవగ్రహ, వాస్తుత్రయంబక ఆవమృత్య హామాలు, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాదములు జరుగును.
సాయంత్రం: ధ్వజప్రతిష్ట, విగ్రహాల గ్రామోత్సవము, శయ్యాదివాసము, పుష్పాట్టి వాసాతి, వేద పారాయణము, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాదములు జరుగును.

19-11-2016 వ తేదీ శనివారం:
యంత్రస్థాపన, ప్రాణబింబావు, తిష్ఠ, నేత్రో న్మేలనము, కూష్మండ్డ బలి, జ్వాలా ప్రజ్వలనము, పూర్ణాహుతి, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాదములు జరుగును.

అన్నదానము:
ఉదయం: 11-30 ని||ల నుండి

గమనిక: భజన బృందములు: నాయనపల్లి, పోతురాజుకాల్వ, బండమీదపల్లి, పెద్దమట్లగోంది, సోదనపల్లి.

ఆహ్వనించువారు:
సోదనపల్లి గ్రామ ప్రజలు
సోదనపల్లి గ్రామం, శింగనమల మం||, అనంతపురము జిల్లా,